22, జనవరి 2013, మంగళవారం

ప్రకృతి వైద్యం

ప్రకృతి వైద్యం

ప్రకృతి వైద్యం అనేది మానవుడు సామరస్యంగా, ప్రకృతి యొక్క నిర్మాణాత్మక సూత్రాలతో, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక దశలలో అతని జీవితంలో రూపొందించుకునే ఒక విధానం. ఇది ఆరోగ్యాన్ని పెంపొందించే, వ్యాధులను నివారించే మరియు చికిత్స చేసి స్వస్ధత కలిగించే, అలాగే శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగి యధాస్ధితికి తీసుకు రాగలిగే గొప్ప అవకాశాలను కలిగి ఉంది.
బ్రిటిష్ నేచురోపతిక్ అసోసియేషన్ (బ్రిటిష్ ప్రకృతి వైద్య సంఘం) యొక్క ప్రణాళికా ప్రకటన ప్రకారం “ప్రకృతి వైద్యం (నేచురోపతి) అనేది శరీరంలో అంతర్లీనంగా ఉండే, స్వస్ధతను కలిగించే ఒక శక్తి యొక్క ఉనికిని గుర్తించి చేసే చికిత్సా విధానం”. అందుచేత, ఇది వ్యాధిని కలిగించే కారణాలను అంటే ఉపయోగించని పదార్ధాలను మరియు విషపూరితమైన పదార్ధాలను తొలగించడానికి, అవసరంలేని మరియు విషపూరితమైన పదార్ధాలను మానవ శరీరం నుండి విసర్జించి వేసి వ్యాధులను నయం చేయడానికి మానవ వ్యవస్ధకు సహకరించాలని సూచిస్తుంది.

ప్రకృతి వైద్యం యొక్క విశిష్ట అంశాలు
ప్రకృతి వైద్యం యొక్క ప్రధాన అంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
  1. అన్ని వ్యాధులు, వాటి కారణాలు మరియు చికిత్సలు ఒకటే. బలమైన దెబ్బలు, గాయాలకు మరియు పర్యావరణ పరిస్థితులకు తప్ప, అన్ని వ్యాధులకు కారణం ఒకటే. అది శరీరంలో అనారోగ్యకరమైన పదార్ధాలు పేరుకుపోయి ఉండడమే. వ్యాధులన్నింటికి చేసే చికిత్స శరీరంలో నుండి పేరుకుపోయిన పదార్ధాలను తొలగించివేయడమే.
  2. వ్యాధులు రావడానికి ముఖ్య కారణం శరీరంలో పేరుకుపోయిన అనారోగ్యకరమైన పదార్ధాలే. బ్యాక్టీరియా (మేలు చేసే లేక కీడు చేసే సూక్ష్మజీవులు) మరియు వైరస్ (రోగాలను కలుగజేసే ఒక రకమైన విషం) వాటికి పెరగడానికి అనువైన అనారోగ్యకరమైన పదార్ధాలు పేరుకుపోయిన వాతావరణం శరీరంలోనే ఏర్పడిన తరువాత అవి శరీరంలో ప్రవేశించి అక్కడే జీవిస్తూ ఉంటాయి. అందుచేత వ్యాధులకు మూలకారణం శరీరంలో అనారోగ్యకరమైన పదార్ధాలు పేరుకుపోవడం, అటు తర్వాత రెండవ కారణం బ్యాక్టిరియా.
  3. తీవ్ర వ్యాధులు శరీరం యొక్క స్వయంకృషితో నయం చేసుకునేటటువంటివి. అందుచేత ఇవి మన స్నేహితులే తప్ప శతృవులు కావు. దీర్ఘకాల వ్యాధులు తప్పుడు చికిత్స మరియు తీవ్ర వ్యాధులను అణగతొక్కి ఉంచడం యొక్క ఫలితాలు.
  4. ప్రకృతి మహోన్నతమైన బాధను, కష్టాలను ఉపశమింపజేసే ఉపశమనకారి. వ్యాధులను నివారించు కోగలిగే శక్తిని, ఆనారోగ్యంగా ఉంటే తిరిగి ఆరోగ్యాన్ని చేకూర్చుకోగల శక్తినీ అదే మానవ శరీరం కలిగి వుంది.
  5. ప్రకృతి చికిత్సలో నయం చేయబడేది కేవలం వ్యాధి ఒకటే కాదు, వ్యాధికి గురైన రోగి యొక్క మొత్తం శరీరమంతా చికిత్సను పొంది, తిరిగి యధాస్ధితికి పునరుధ్దరింపబడుతుంది.
  6. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉండే రోగులు కూడా ప్రకృతి వైద్యంలో తులనాత్మకంగా తక్కువ సమయంలో విజయవంతంగా నయం చేయబడతారు.
  7. ప్రకృతి వైద్యంలో అణగారి ఉన్న వ్యాధులు కూడా బయటకు తేబడి శాశ్వతంగా తొలగింపబడతాయి.
  8. ప్రకృతి వైద్యం శారీరక, మానసిక, సాంఘిక మరియు ఆధ్యాత్మికమైన అన్ని అంశాలలోనూ ఒకే సమయంలో చికిత్స చేస్తుంది.
  9. ప్రకృతి వైద్యం శరీరం మొత్తం అంతటికీ చికిత్స చేస్తుంది.
  10. ప్రకృతి వైద్యం ప్రకారం ‘ఆహారం మాత్రమే మందు’ , బయట ఔషధాలేవీ వాడబడవు.
  11. ఎవరి ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం వారు ప్రార్ధన చేయడం అనేది చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం.

ఆహార సంబంధిత చికిత్స
ఈ చికిత్స ప్రకారం ఆహారాన్ని తప్పని సరిగా దాని సహజరీతిలోనే తీసుకోవాలి. తాజాగా ఉండే వివిధ ఋతువులలో పండే ఆయా పండ్లను, తాజాగా ఉండే ఆకుపచ్చని ఆకు కూరలను మరియు మొలకెత్తిన విత్తనాలు చాలా శ్రేష్టమైనవి. ఆహరం ఈ క్రింద చూపిన విధంగా., ముఖ్యంగా మూడు రకాలుగా విభజింపబడింది:
  1. తొలగించి వేయబడే ఆహారం : ద్రవపదార్ధాలుః నిమ్మ, పుల్లని రసాలు, లేత కొబ్బరి నీరు, ద్రవరూపంలోకి తయారుచేయబడిన కూరగాయలు, మజ్జిగ, గోధుమ గడ్డి రసాలు మొదలగునవి.
  2. సాత్విక ఆహారం: పండ్లు, కూరగాయలు, పండ్లను ముక్కలు ముక్కలుగా కోసి తయారుచేసే సాలడ్లు, ఉడకబెట్టిన/ఆవిరిపట్టిన కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, కూరగాయలతో చేసే పచ్చడి మొదలైనవి.
  3. నిర్మాణాత్మకమైవ ఆహారం: సమృధ్దిగా ఉండే పిండి, దంపుడు బియ్యం (పైపొట్టు తీసివేయబడని బియ్యం), కొద్దిగా పప్పు ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పెరుగు మొదలైనవి.
క్షారధర్మం కలిగి ఉండడం వల్ల ఈ ఆహారాలు ఆరోగ్యాన్ని వృద్ధి చేయడంలోనూ, శరీరాన్ని నిర్మలమైనదిగా, స్వఛ్చమైనదిగా చేయడంలోనూ, మరియు వ్యాధులను తట్టుకోగలిగేలాగ చేయడంలోనూ సహకరిస్తాయి. ఈ దిశలో, సరైన ఒక సమీకృతమైన, సమతుల్యంగా ఉండే ఆహారం అవసరం. సరైన ఆరోగ్య పోషణకు మనం తీసుకునే ఆహారం 20% ఆమ్లగుణం మరియు 80% క్షారాన్ని కలగివుండాలి. మంచి ఆరోగ్యాన్ని కోరుకునే ఏ వ్యక్తికైనా సరే సమతుల్యంగా, సమీకృతంగా ఉండే ఆహారం అవసరమవుతుంది. ప్రకృతి వైద్యంలో ఆహారం ఒక ఔషధంగా పరిగణింపబడుతుంది.

ఉపవాస చికిత్స
కొంత కాలం పాటు ఆహారం లేక పానీయాలను లేక రెండింటినీ కూడా తీసుకోవడం కావాలని తెలిసివుండీ, ఐఛ్చికంగా మానివేయడం అనే చర్య ప్రాథమికంగా ఉపవాసం లేక పధ్యం చేయడం అనబడుతుంది. ఉపవాసం అనే మాట పాతకాలం నాటి ఆంగ్లభాష ‘ఫీస్టాన్’నుండి పుట్టింది. దీని అర్ధం ఉవాసాన్ని పాటించడం, ఖచ్చితంగా ఉపవాసం ఉండడం అని. సంస్కృతంలో ‘వ్రత ‘ అంటే ‘సంకల్పం’ అలాగే ‘ఉపవాసం’ అంటే ‘దేవుడికి చేరువగా’ అని అర్ధం (ఉపవాసం చేసే వ్యక్తికి సంబంధించి). ఈ ఉపవాసం అనేది మొత్తంగా ఉండవచ్చు లేక మొదలు పెట్టిన వేళనుండి పాక్షికంగా కూడా ఉండవచ్చు. దీనిని పొడింగించవచ్చు లేక మధ్యలో ఆపివేస్తూ కూడా ఉండవచ్చు. ఉపవాసం ఉండే కాల వ్యవధికి సంబంధించినంత వరకూ. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపవాసం ఉండడం ఆనేది ఒక ముఖ్యమైన చికిత్సా విధానం. మానసికంగా సిధ్దపడి ఉండడం ఉపవాసం చేయడానికి ఒక ప్రాధమికమైన, ముందు షరతు వంటిది. సమర్ధవంతమైన ప్రకృతి వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే దీర్ఘకాలంపాటు కొనసాగించే ఉపవాసాన్ని చేపట్టవలసి ఉంటుంది.
ఉపవాసం ఎంతసేపు ఉండడం అన్నది రోగి యొక్క వయసు, వ్యాధి స్వభావం మరియు ఇంతకు ముందు వాడిన మందుల రకాలు, వాటి పరిమాణం అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. ఒకోసారి ఈ ఉపవాసాలను స్వల్పకాలం పాటు వరుసగా రెండు లేక మూడు రోజులపాటు చేపట్టడం మరియు ఈ ఉపవాసపు కాలవ్యవధిని క్రమేపీ రోజు రోజుకీ పెంచడం శ్రేయోదాయకం. వారు సరైన విశ్రాంతిని తీసుకుంటూ సరైన వృత్తి పరమైన నిపుణుల పర్యవేక్షణలో ఈ ఉపవాసాన్ని కొనసాగిస్తూ ఉంటే దీనివల్ల ఉపవాసం చేస్తూ ఉండే రోగికి ఏ విధమైన హాని కలుగదు.
నీటితోనూ, పళ్ల రసాలతోనూ లేక తాజా, పచ్చి కూరగాయల రసాలనూ తీసుకుంటూ ఉపవాసాన్ని చేయవచ్చు. నిమ్మరసంతో ఉపవాసం చేయడం అత్యంత శ్రేష్టమైనది, భధ్రత కలిగిన మరియు అత్యంత సమర్ధవంతమైన పద్ధతి. ఉపవాసం చేస్తున్న సమయంలో శరీరం మండుతూ ఉండే పెద్ద పరిమాణంలో పేరుకుపోయి ఉన్న వ్యర్ధ పదార్ధాలను విసర్జిస్తుంది. క్షారధర్మంతో గల పానీయాలను తాగడం ద్వారా మనం ఈ విధంగా శుభ్రంచేసుకునే ప్రక్రియకు తోడ్పడవచ్చు. ఈ పానీయాలలో ఉండే చక్కెర గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. అందుచేత పళ్ల రసాలతో ఉపవాసం చేయడం శ్రేష్టమైన పద్ధతి. తాగే ముందు తాజా పండ్ల నుండి ఈ పండ్ల రసాలు తయారుచేయబడి ఉండాలి. డబ్బాలలో నిలవ ఉంచినవి లేక ఘనీభవించబడిన పానీయాలను తాగకూడదు. రోగి శరీరంలో ఉండిపోయే, విసర్జించవలసిన మలం వల్ల ఏర్పడే గ్యాస్ (వాయువు)తో గానీ లేక పాడైపోయి, కుళ్లిపోయిన పదార్ధాల వల్ల గానీ, రోగి ఏ విధంగానూ అసౌకర్యాన్ని, ఇబ్బందిని పొందకుండా ఉండడానికి వీలుగా, ఉపవాసాన్నిప్రారంభించిడానికి ముందుగా ఎనీమా ద్వారా పేగులను శుభ్రం చేసి, ఖాళీ చెయ్యడం ఉపవాసం చేసే అన్ని సందర్భాలలోనూ తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్త. ఉపవాసం ఉన్న కాలంలో కనీసం ప్రతి రోజు విడిచి రోజు ఎనీమాను ఉపయోగించవలసి ఉంటుంది. లోపలికి తీసుకునే ద్రవ పదార్ధాల మొత్తం పరిమాణం ఇంచుమించు 6-8 గ్లాసుల వరకూ ఉండాలి. ఉపవాస సమయంలో పేరుకుపోయిన విష మరియు విషపూరిత వ్యర్ధ పదార్ధాలను విసర్జించే ప్రక్రియలో చాలా శక్తి ఖర్చవుతుంది. అందుచేత ఉపవాసం చేసే సమయంలో రోగి వీలైనంతమేరకు శారీరక మరియు మానసిక విశ్రాంతిని తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
ఉపవాసం విజయవంతమవడం అన్నది చాలా వరకు అది ఏ విధంగా ఆపివేయబడింది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఉపవాసాన్ని ఆపివేయడానికి ప్రధానమైన నిబంధనలుః అతిగా తినకుండా ఉండడం, తినేది నెమ్మదిగా తినడం. మీరు తినే ఆహారాన్ని బాగా, పూర్తిగా, నమలాలి మరియు సాధారణంగా తీసుకునే ఆహారానికి క్రమేపి అలవాటు పడి, దానికి మీరు అనువుగా మారడానికి తగినన్ని రోజులు తీసుకోవాలి.
ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభాలు మరియు మానసిక ప్రభావాలు
చరిత్ర అంతా కూడా, అనాది నుండి నేటి ఆధునిక కాలం వరకూ అనేక సంస్కృతులకు సంబంధించిన వైద్యులు, వివిధ పరిస్ధితులలో విస్తరించబడిన ఉపవాసాన్ని ఒక చికిత్సగా సిఫార్సు చేశారు. గతంలో పరిశీలనలు ఒక శాస్త్రీయపరమైన విధానంలో లేక ఒక అవగాహనతో అధ్యయనం చేయబడకపోయినప్పటికీ, ఉపవాసాన్ని ఇప్పటికి కూడా ఒక చికిత్సా విధానంగా వినియోగించడాన్ని ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాయి. గతంలో ఇటువంటి పరిశీలనలు జంతువుల ప్రవర్తన ఆధారంగా చేయబడేవి, కాని ఈనాడు అవి జంతువుల శరీర (ధర్మం) శాస్త్రంపై ఆధారపడి చేయబడుతున్నాయి. ఈ వ్యాసంలో జీవశాస్త్ర మరియు జీర్ణ ప్రక్రియ లాభాలను వివరించే సాహిత్యాన్ని సమీక్షించడం ద్వారా, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో ఈ ఉపవాసం అనేది ఎంతవరకూ ఉపయోగకరంగా ఉంటుందో సూక్ష్మంగా పరిశీలించి చూడడానికి ప్రయత్నిద్దాం.
ఉపవాసం (కాలరీలపై, అదుపు, ఆంక్షలు) మరియు మధ్య మధ్య ఆగి చేస్తూ ఉండే ఉపవాసం ద్వారా సంక్రమించే జీవశాస్త్ర ప్రభావాలలో ప్రధానమైనని ఈ క్రింద చూపబడ్డాయి. ఇన్సులిన్ పెరుగుదల ఫలితంగా తగ్గే ప్లాస్మా (రక్తంలో ఉండే ఒక తెల్లటి ద్రవం) గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ రసాయనాలు పెరగడం, మరియు మెరుగుపడిన గ్లూకోజ్ సహనశక్తి, పోషకాలలో కొవ్వు పదార్ధాలలో మరియు డి.ఎన్.ఏ. తగ్గిన ఆమ్లజనీకరణ నష్టం (డ్యామేజ్) ద్వారా సూచించబడినట్లు తగ్గే ఆమ్లజనీకరణకు సంబంధించిన ఒత్తిడి స్థాయిలు ఉష్ణంతో సహా, ఆమ్లజనీకరణ సంబంధిత మరియు జీర్ణక్రియకు సంబంధించిన ఒత్తిడులు వంటి వివిధ రకాలైన ఒత్తిడులకు తట్టుకోగలిగే సామర్ధ్యం పెరగడం వ్యాధి నిరోధకశక్తి పెరుగుదలతో పని చేయడం వంటివి.
స్ధూలంగా జీవశాస్త్రం మరియు జీవకణ శాస్త్రం రెండూ కూడా కేలరీల అదువు (సి.ఆర్) లేక మధ్య మధ్య ఆపి చేస్తువుండే ఉపవాసాల (ఐ.ఎఫ్) విధానంతో తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. స్ధూల జీవశాస్త్రం ప్రకారం శరీరంలో కొవ్వు మరియు బరువు చెప్పుకోతగ్గ స్ధాయిలో తగ్గించవచ్చుననుకోండి. ఇది ఆరోగ్యకరమైన గుండె నాళికామయ విధానాన్ని బలపరిచి, మయోకార్జియల్ ఇన్ఫారక్షన్ (గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి) వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. గుండెనాళికా సంబంధిత రక్షణకు అదనంగా ఇది మానవ జాతికి పోషకాలనందించే కేంద్ర బిందువైన కాలేయంలో ఒత్తిడిని మరింత ఎక్కువగా తట్టుకోగలిగే శక్తిని ప్రేరేపిస్తుంది. కిటోన్ బాడీస్ (కొవ్వును తగ్గించేవి -B-హైడ్రోక్సిబుటిరేట్) వంటి ప్రత్యామ్నాయ శక్తుల యొక్క మూలాధార నిలవలు, మానవజాతికి జీవితంలో అధికమైన ఒత్తిడికి తట్టుకోగలిగే వీలును, శక్తిని కలిగిస్తాయి. మితిమీరిన, అధికమైన మరియు అపాయకరమైన, హానిని కలిగించే రక్తపు గ్లూకోజ్, ఇన్సులిన్ కు మరియు గ్లూకోజ్ కు పెరిగిన ప్రతిస్పందన. దీనిని ఒక మూలాధారమై శక్తిగా వినియోగించడం ద్వారా తగ్గించబడుతుంది.


బంకమట్టితో చేసే చికిత్స
తడిమట్టి, లేక మట్టి ముద్దతో చేసే చికిత్సా విధానం చాలా తేలికైనది, సమర్ధవంతమైనదీ కూడా. దీనికోసం వినియోగించే తడిమట్టి భూమి ఉపరితలం నుండి 3–4 అడుగుల లోతునుండి తీయబడి, పరిశుభ్రంగా ఉండాలి. చిన్న చిన్ని రాళ్ల ముక్కలు లేక రసాయనిక ఎరువులు మొదలైనవేవీ ఈ మట్టిలో ఉండకూడదు.
ముద్దగా ఉండే తడిమట్టి శరీరంపై, ఆరోగ్యానికి, అనారోగ్యానికి కూడా అత్యంత ప్రభావాన్ని కలిగి ఉండే ప్రకృతి యొక్క 5 శక్తులలో ఒకటి. బంకమట్టి ఉపయోగించడంలో ఉన్న లాభాలుః
  1. సూర్యరశ్మిలో ఉండే రంగులన్నింటిని, దీనికుండే నలుపురంగులో లీనం చేసుకుని, దానిని మన శరీరానికి అందిస్తుంది.
  2. బంకమట్టి దీర్ఘకాలం పాటు తేమను తనలోనే ఉంచుకుంటుంది. శరీరభాగాలపై అద్దినపుడు, ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది.
  3. దీనికి నీటిని కలుపుతూ, దాని రూపాన్ని, ఆకారాన్ని సులభంగా మలుచుకోవచ్చు.
  4. ఇది చవకైనది, సులభంగా దొరికేది కూడా.
వాడే ముందు బంకమట్టి ముద్దను ఎండబెట్టి, పొడిగా చేసి, రాళ్లను, గడ్డికి సంబంధించిన రేణువుల వంటి వాటిని మరియు ఇతర కలుషితాలను జల్లించి ఏరివేయాలి.
బంక మట్టి పట్టీ – శరీరంపై (స్ధానికంగా) ఉపయోగించడం
నానబెట్టిన బంకమట్టి ముద్దను ఒక పలుచని, తడిగా ఉండే నూలు గుడ్డపై పెట్టి, రోగియొక్క కడుపు పరిమాణాన్ని బట్టి చదునుగా ఉండే పలుచని ఇటుకగా చేస్తూ, దానిని అద్దాలి. ఈ మట్టి ముద్దను అద్దే ప్రక్రియ 20 నుండి 30 నిముషాల వరకు ఉంటుంది. చల్లటి వాతావరణంలో దీనిని ఉపయోగించినపుడు, దానిపై ఒక దుప్పటిని కప్పుతూ, శరీరాన్ని కూడా కప్పివేయాలి.
బంక మట్టి పట్టీ వల్ల లాభాలు
  1. కడుపుపై దీనిని అద్దినపుడు అన్ని విధాలైన అజీర్ణాన్ని ఇది తొలగిస్తుంది. పేగు సంబంధిత వేడిని తగ్గించి, కడుపులో ఉండే కండరాలలో కెరటాల మాదిరిగా కదులుతూ ఉండే తరంగ చలన రీతిని ప్రేరేపిస్తుంది.
  2. విపరీతంగా వుండే తలనొప్పి తో బాధపడుతున్నప్పుడు తలపై చిక్కగా ఉండే మట్టి పట్టీను అద్ది పెట్టి వుంచి నట్లయితే, వెంటనే నొప్పి ని తగ్గిస్తుంది. అందుచేత, దీర్ఘకాలం పాటు చల్లని వినియోగం అవసరమనిపించి నపుడు, ఇది సిఫార్సు చేయబడుతుంది.
  3. కళ్లకలక వచ్చినపుడు, కళ్లగుడ్లలో రక్తస్రావం కలిగినపుడు, దురదగా ఉన్నప్పుడు, కొన్నింటికి సరిపడని శరీరతత్వంతో దురదలు, మంటలు హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి వంటి దృష్టి లోపాలు మరియు ప్రత్యేకంగా గ్లుకోమా (తీవ్రమైన కంటి వ్యాధి) లో ఇది కళ్లపై బంకమట్టి పట్టీని ఉంచడం కంటి గుడ్లలో ఉండే బిరుసు తనాన్ని, సంబంధిత ఉద్రిక్తతను తగ్గించడంలో సహకరిస్తుంది.

ముఖంపై బంకమట్టి పట్టీ
నానపెట్ట బడిన బంకమట్టీ పట్టీని ముఖంపై అద్ది, 30 నిముషాల సేపు ఆరబెట్టాలి. శరీర ఛాయను మెరుగు పరచడంలో ఇది ఉపకరిస్తుంది. అలాగే మొటిమలను మరియు తెరుచుకుని ఉన్నట్లుండే చర్మపు సూక్ష్మరంధ్రాలను నిర్మూలించడంతో పాటు, అవి తిరిగి పూర్తిగా తొలగింపబడడానికి వీలు కలుకలిగిస్తుంది. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాల వంటి మచ్చలను, చారలను కూడా నిర్మూలించడంలో ఇది సహకరిస్తుంది. 30 నిముషాల తర్వాత మొహాన్ని చల్లటి నీటితో శుభ్రంగా, ధారాళంగా కడగాలి.

బంక మట్టితో స్నానం
కూర్చున్న లేక పడుకున్న స్ధితిలో రోగికి బంక మట్టిముద్దను ఉపయోగించవచ్చు. చర్మ ధాతువు ప్రసరణను పెంచి మరియు శక్తివంతం చేయడం ద్వారా చర్మం యొక్క స్ధితిని ఇది మెరుగు పరుస్తుంది. అయితే ఈ స్నానం చేయడం వల్ల జలుబు రాకుండా శ్రధ్ద తీసుకోవాల్సి ఉంటుంది. అటు తరువాత రోగిని చల్లటి నీటితో జెట్ స్ప్రే (నీటి బిందువులను వెదజల్లేది) తో శుభ్రంగా, ధారాళంగా కడిగివేయాలి. ఒకవేళ రోగి చల్లదనానికి ఒణికిపోతున్నట్లయితే, వేడి నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు వెంటనే తుడవాలి. అలాగే, అతనిని వెచ్చటి పక్కమీదకు తరలించాలి. ఈ బంకమట్టి ముద్దతో స్నానం చేసే కాలవ్యవధి 45 నుండి 60 నిముషాల వరకూ ఉండవచ్చు.
బంకమట్టితో స్నానం చేయడం వల్ల లాభాలు
  1. బంకమట్టి యొక్క ప్రభావాలు సేద తీర్చేవి, సత్తువనిచ్చేవి మరియు శక్తినిచ్చి బలాన్ని నింపేవి.
  2. గాయాలకు మరియు చర్మ వ్యాధులకు, బంకమట్టిని పట్టీగా అద్దడం మాత్రమే నిజమైన బ్యాండేజ్ (పట్టి) వంటిది.
  3. శరీరానికి చల్లదనాన్ని చేకూర్చడానికి ఈ బంకమట్టి చికిత్స ఉపయోగించబడుతుంది.
  4. శరీరం యొక్క విషపూరితమైన పదార్ధాలను బంకమట్టి తనలో లీనం చేసుకుంటుంది, అలాగే, చివరికి వాటిని శరీరంపై నుండి తొలగిస్తుంది.
  5. మలబధ్దకం, ఉద్రిక్తత వల్ల తలనొప్పి , అత్యంత స్ధాయిలో ఉండే రక్తపు పోటు, చర్మవ్యాధులు మొదలగు వివిధ వ్యాధులకు బంకమట్టి విజయవంతంగా వాడబడుతుది.
  6. గాంధీజి మలబద్ధకం నుండి తప్పించుకోవడానికి బంకమట్టి పట్టీను ఉపయోగించేవారు.


హైడ్రోతెరపీ (వ్యాధులకు చికిత్స చేయడంలో బాహ్యంగా, అంతర్గతంగా నీటిని ఉపయోగించడం)
ప్రకృతి వైద్యం/చికిత్సలో హైడ్రోతెరపీ ఒక విభాగం. వివిధ రూపాలలో నీటిని ఉపయోగిస్తూ అనారోగ్యానికి చేసే చికిత్స ఇది. ఈ పద్ధతిలో నీటిని ఉపయోగించడం చాలా పాతకాలంనాటి నుండి ఆచరణలో ఉంది. ఉరఃకుహురంలో నీరు చేరినప్పుడు, నీరు, ఉష్ణ సంబంధిత చికిత్స దాని ఉష్ణోగ్రత ప్రభావాన్ని అదనంగా ఉపయోగించుకుంటుంది. చల్లటి మరియు వెచ్చిటినీటి స్నానంతోనూ, ఆవిరి స్నానం (సోనా), స్నానం చేసినట్లుగా శరీరం చుట్టూ గుడ్డలను చుట్టబెట్టుకుని చేసే స్నానం మొదలైన వాటిలో దాని అన్ని రూపాలలోనూ కూడా, అంటే ఘనరూపంలోనూ, ద్రవరూపంలోనూ, ఆవిరి రూపంలోనూ, మంచు రూపంలోను, బాహ్యంగానూ, అంతర్గతంగానూ చేయబడుతుంది. నీరు, అత్యంత పురాతనమైన అన్ని వ్యాధుల చికిత్సలలోనూ ఏమాత్రం సందేహం లేకుండా, వాడే ఉపకరణాలలో ఒకటి. అత్యంత ఘనమైన, గొప్పదైన ఈ ఉపశమనాన్నిచ్చే ఉపకరణం, ఇపుడు విధానపరంగా క్రమబధ్దీకరణ చేయబడి ఒక విజ్ఞాన శాస్త్రంలోకి రూపొందించబడింది. నీటిని ఉపయోగించి చేసే ఈ చికిత్సా పద్ధతుల వినియోగాలు సాధారణంగా వివిధ ఉష్ణోగ్రతలలో చేయబడతాయి. ఈ చికిత్సలో ఉష్ణోగ్రతల వినియోగాలు ఈ క్రింద పట్టికలో వివరించబడ్డాయి.
క్రమ సంఖ్య.
ఉష్ణోగ్రత
oఫారెన్ హీట్
oసెల్షియన్
1.
అతి శీతలం (ఐస్ ను వాడడం)
30-55
-1-13
2.
శీతలం
55-65
13-18
3.
చల్లదనం
65-80
18-27
4.
గోరువెచ్చని
80-92
27-33
5.
వెచ్చని (మధ్యస్తంగా)
92-98
(92-95)
33-37
(33-35)
6.
వేడి
98-104
37-40
7.
చాలా వేడి
104 పైచిలుక
40 పైచిలుక
నీటి యొక్క ప్రభావాలు మరియు ఉపయోగాలు
  1. చల్లటి, పరిశుభ్రమైన నీటితో సరిగా స్నానం చేయడం నీటితో చేసే చికిత్సలో ఒక అమోఘమైన పద్ధతి. అటు వంటి స్నానం చర్మంపై ఉన్న సూక్ష్మరంధ్రాలను తెరుచుకునేటట్లు చేసి, శరీరాన్ని తేలికగానూ, తాజాగానూ ఉండేటట్లు చేస్తుంది. చల్లటి నీటితో చేసే స్నానంలో శరీరం యొక్క అన్ని భాగాలూ మరియు కండరాలు ఉత్తేజితమవుతాయి. అలాగే స్నానంచేసిన తరువాత రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. పాత సాంప్రదాయ రీతిలో నదులలో, వాగులలో లేక జలపాతాలలో ప్రత్యేక సందర్భాలలో స్నానం చేయడం వాస్తవంగా నీటితో చేసే ప్రకృతి చికిత్సా విధానంలోని ఒక పధ్దతే.
  2. కోరుకున్న ఉష్ణ సంభంధిత మరియు యాంత్రిక ప్రభావాలను ఉత్పత్తిచేయడంలో ఇది అత్యంత అనువైన మాధ్యమం, దీనిని శరీరంపై పరిమిత ప్రాంతంపై గాని లేక మొత్తం శరీర ఉపరితలంపై గాని ఉపయోగించవచ్చును.
  3. ఇది వేడిని తనలో లీనం చేసుకోగలదు, అలాగే వేడిని బయటకు విడుదల చేయడంలో కూడా సర్వసిధ్దంగా ఉంటుంది. అందుచేత దీనిని శరీరాన్నుండి వేడిని సంగ్రహించడం లోనూ లేక దానికి వేడిని అందజేయడంలోనూ కూడా ఉపయోగించవచ్చును. ప్రధానంగా చల్లటి నీటిని ఉపయోగించినప్పటికీ, దాని ఉద్దేశం శరీరం లోని వేడిని తీసివేయడం గానీ లేక తగ్గించివేయడం గానీ కాదు, కానీ, పోగొట్టుకున్న దానికంటే అధిక వేడిని పుట్టించడానికి జీవశక్తిని పెంచడం కోసం మాత్రమే.
  4. విశ్వవ్యాప్తమైన ఒక ద్రావకం వంటిదై ఉండడం వలన, అంతర్గతంగా ఎనీమా లేక పేగులలో వ్యర్ధ పదార్ధాలను బయటకు విసర్జింప చేయడంలో, వాడే లేక త్రాగే నీటి సాధనాల రూపంలో, మూత్ర సంబంధిత పదార్ధాలు, యూరియా, లవణాలు, అధికమైన చక్కెర మరియు వ్యర్ధ పదార్ధాలైన అనేక ఇతర రక్త మరియు ఆహార సంబంధిత రసాయనాలను తొలగించడంలో పెద్దగా సహకరించేది మరియు ఉపయోగకరమైనది ఇది.
ఈ పధ్దతులను విజయవంతంగా ఉపయోగించడానికి ఒక స్ధాయిలో ఉండే జీవశక్తి అవసరమవుతుందని గమనించవలసి ఉంటుంది. ఈ శక్తి అతిస్వల్పంగా ఉన్నప్పుడు ఇవన్నీ వ్యర్ధమే. తీవ్రమైన, అసాధారణమైన పరిస్ధితులలో అధిక స్ధాయిలో జీవశక్తి ఉంటుంది. అందువల్ల, దాని ప్రతిస్పందనకు ఖచ్చితమైన అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులలో, ఈ జీవశక్తి స్ధాయి తక్కువగా ఉన్నప్పుడు, ఈ స్నానాలు అంతగా ఉపయోగపడవు, అయితే, అటువంటి సందర్భాలలో బంకమట్టి ముద్దలతో చేసే పట్టీలు ఉపకరిస్తాయి, ఎందుకంటే వాటి వినియోగంలో ఇవి తేలికైన, మృదువైన స్ధాయిలో ఉంటాయి కాబట్టి.
చికిత్సలో నీటిని అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుంది. వివిధ రకాలైన ఈ చికిత్సలు:
  1. ఒత్తడం మరియు కాపడం పెట్టడం
    • చల్లటి ఒత్తిడి: కడుపుపై చల్లటి ఒత్తిడి పెట్టడం.
    • వేడితో ఒత్తిడి పెట్టడం: ఛాతి భాగం, ఉదర భాగం, పొడిగా, నడ్డి చుట్టూ ఒడ్డాణం మాదిరి భాగం, గొంతు చుట్టూ, మోకాలి చుట్టూ భాగం మరియు పూర్తిగా తడిగా ఉండే షీట్ ప్యాక్
    • వేడిగా, చల్లగా ఒత్తిడి పెట్టడం: తల, ఊపిరితిత్తి, మూత్రపిండం, జీర్ణకోశం, కాలేయానికి సంబంధించిన భాగాలు, కటి భాగం మరియు ఉదర సంబంధిత వేడిగా మరియు చల్లని ఒత్తిడి.
    • కాపడం పెట్టడం.
  2. స్నానాలు
    • తుంటి భాగంపై స్నానం- చల్లటి, మధ్యస్తంగా ఉండే, వేడిగా ఉండే స్టిజ్ స్నానం మరియు ప్రత్యామ్నాయ తుంటి స్నానం.
    • వెన్నెముక స్నానం మరియు వెన్నెముక భాగంపై నీటిని వెదజల్లడం ( స్ప్రే ) – చల్లటి, మధ్యస్థంగా ఉండే, వేడిగా ఉండే స్నానం.
    • పాదాలు, చేతులకు స్నానం, చల్లటి మధ్యస్తంగా ఉండే మరియు వేడిగా ఉండే స్నానం మరియు వీటితో కలిసి వుండే, వ్యత్యాసంతో ఉండే చేతులకు స్నానం మరియు వ్యత్యాసంతో ఉండే పాదాలకు స్నానం.
    • ఆవిరిని లోపలికి పీల్చడం మరియు ఆవిరి స్నానం
    • సోనా స్నానం
    • స్పాంజ్ తో చేసే స్నానం
  3. జెట్ స్ప్రేతో మర్దనః
    • చల్లగా, మధ్యస్తంగా, వేడిగా, ప్రత్యామ్నాయంగా, గుండ్రంగా ఉండే జెట్ స్ప్రే మర్దనలు.
    • తలముంచి స్నానాలుః తలముంచి చల్లటి స్నానం, మధ్యస్తంగా ఉండే నీటితో తల ముంచి చేసే స్నానం, వేడినీటితో తల ముంచి చేసే స్నానం, వేడినీటితోనూ, చన్నీటితోనూ తలముంచి చేసే స్నానం.
    • తలపై చన్నీటి ధారలతో స్నానం
    • బలమైన గాయాలకు
  4. నీటిలో మునిగి చేసే స్నానాలుః చన్నీటిలో మునిగి స్నానం, రాపిడితో చన్నీటిలో మునిగి స్నానం, మధ్యస్తంగా ఉండే మునిగి చేసే స్నానం, వేడినీటిలో మునిగి చేసే స్నానం, మధ్యస్తంగా ఉండే సగం వరకూ చేసే స్నానం, ఎప్సమ్ సాల్ట్ (తెల్లని చూర్ణం రూపంలో చేదుగా ఉండే మెగ్నిషియమ్ సల్ఫేట్)తో కొద్ది కొద్దిగా నీటిలో క్రమేపీ మునుగుతూ చేసే స్నానం, ఉబ్బసపు స్నానం, సుడిగుండంలో స్నానం, నీటి అడుగున చేసే మర్దన.
  5. ఎనిమాః కొద్ది కొద్దిగా పెంచుతూ చేసే ఎనీమా, యోనిసంబంధిత నీటి స్నానం, చన్నీటితో స్నానం, మధ్యస్తంగా స్నానం, వేడినీటి స్నానం..
    నీటితో చేసే చికిత్సలలో పెద్ద ప్రేగుకు చికిత్స ఒక పద్ధతి.

పెద్దప్రేగుకు నీటితో చేసే చికిత్స
ఇది పెద్దపేగును శుభ్రంచేసి, ధారాళంగా కడిగివేసే ప్రక్రియ. దీని చికిత్స ఎనిమా మాదిరిగానే ఉంటుంది, అయితే విస్తృతమైనదిగా ఉంటుంది. పెద్దపేగులో పేరుకు పోయి, అలాగే నిలిచిపోయిన మల పదార్ధాలను నొప్పి కలగకుండా, మృదువుగా ఉండే ఒత్తిడి ద్వారా శుభ్రంగా కడగడానికి లేక విషపూరిత పదార్ధాలను తొలగించడానికి శుభ్రంగా ఉండే వడగొట్టబడిన నీటిని దీనికి వాడతారు. అయితే ఇది ఎన్నిసార్లు చేయాలి అనేది సంబంధిత వ్యక్తిని బట్టి ఉంటుంది. పెద్దపేగును పూర్తిగా శుభ్రం చేయడానికి చాలామందికి 3 – 6 పర్యాయాలు వరసగా ఈ చికిత్సను చేయాల్సి ఉంటుంది.

నీటితో చేసే చికిత్స వల్ల కలిగే శారీరక ప్రభావాలు మరియు లాభాలు


మర్దనతో చికిత్స
మర్దన చేయడం ఒక అమోఘమైన సాత్విక వ్యాయామం వంటిది. మర్దించడం అనే భావం వచ్చే ఈ మాట ‘మేసియర్‘ అనే గ్రీకు మాటనుండి వచ్చింది మరియు ఫ్రెంచ్ భాషనుండి వచ్చిన ‘రాపిడితో మర్దించడం‘ లేక అరబిక్ భాషలోని మాట స్పర్శించుట, అనుభూతిని పొందుట లేక పట్టకోవడం‘ లేక లాటిన్ భాషలోని మాట ‘ముద్ద లేక పిండి ముద్ద’ ల నుండి వచ్చిన పదం. మర్దన అనేది మృదువైన ధాతువులను, కండరాలను చేతితో, చేతి వేళ్లతో మృదువుగా నొక్కుతూ, శారీరక (శరీర నిర్మాణ సంబంధిత,), శరీర విధులకు (శరీరధర్మ) సంబంధించిన మరియు కొన్ని సందర్భాలలో మానసిక ఉద్ధేశాలతోనూ మరియు లక్ష్యాలతోనూ, ఒక క్రమపద్ధతిలో నిర్వహించడం. నగ్న శరీరంపై లేక ఏ అఛ్చాదన లేనటువంటి శరీరంపై సరైన రీతిలో దీనిని ఆచరించినట్లయితే, అత్యంత ఉత్తేజభరితంగా, నూతన శక్తిని కలుగజేసేదిగా ఉంటుంది.
మర్దన ప్రకృతివైద్యంలో కూడా ఒక విధానమై, మంచి ఆరోగ్యాన్ని పోషించుకోవడానికి చాలా అవసరమైనటువంటిది. మర్దన అనేది శరీరంపై చేతితో ఒత్తిడిని కలిగిస్తూ, రుద్దుతూ ఉండడం – ఒక నిర్మాణక్రమంతోనూ, అలా కాకుండానూ, స్ధిరంగానూ లేక కదులుతూ – ఉద్రిక్తత, కదలిక లేక ప్రకంపనంతోనూ చేతితో లేక యాంత్రిక సాధనాలతో కూడా చేసేటటువంటిది. మర్ధనలతో లక్ష్యంగా పెట్టుకోబడిన ధాతువులలో స్నాయువులు, అస్ధిబంధకాలు, చర్మం, జాయింట్లు లేక సంబంధిత ధాతువులు, అలాగే రసనాళికా వాహికలు వంటివి ఉంటాయి. చేతులతోనూ, వేళ్లతోనూ, మోచేతుల తోనూ, మోకాళ్లతోనూ, ముంజేతులతో మరియు అడుగులతోనూ కూడా మర్దన చేయవచ్చు. ఎనభై (80) కు మించిన, వివిధ రకాలైన, గుర్తింపబడిన, మర్దన చేసే పద్ధతులున్నాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు శరీర అవయవాలను బలోపేతం చేయడానికి ఇవి ఉద్దేశింపబడి ఉంటాయి. శీతాకాలంలో శరీరమంతటిపైన మర్దన చేయడం అయిన తర్వాత, సూర్యరశ్మిలో స్నానం చేయడం ప్రసిధ్ది గాంచిన, ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకోవడం కోసం చేసే సాధన. ఇది అందరికి లాభదాయక మైనది. సూర్యకిరణాలతో స్వేద తీర్చుకోవడం అనే చికిత్సతో పాటుగా ఈ మర్దన ఉమ్మడి లాభాలనందిస్తుంది. వ్యాధితో ఉన్న పరిస్ధితులలో, మర్దన చేయడంలో ఉండే నిర్దుష్ట పద్ధతులు, చిట్కాల ద్వారా అవసరమైన చికిత్సా ఫలితాలను పొందవచ్చు. వ్యాయామాలు చేయలేనటువంటి వారికి మర్దన అన్నది ఒక ప్రత్యామ్నాయం. ఈ మర్దన ద్వారా, వ్యాయామం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆవనూనే, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె (ఒక విధమైన సీమ చెట్టు కాయనుండి తీసిన నూనె) సువాసన వెదజల్లే నూనెలు మొదలైన వివిధ రకాలైన, చికిత్సాపరమైన ప్రభావాలను కలిగివుండే నూనెలను మర్దన చేయడంలో వాడడం జరుగుతుంది.
మర్దన చేయడంలో ప్రాథమికంగా, ఏడు రకాలైన, నిర్వహణా పద్ధతులున్నాయి. అవిః తాకడం, (ఒక లయ పద్ధతిలో) మెత్తగా గుద్దడం, రుద్దడం, శరీరపైభాగాన్ని మెల్లగా, నెమ్మదిగా కుదుపుతూ, నొక్కుతూ ఉండడం, శరీరంపై తాళం వేస్తున్నట్లుగా లయప్రకారం చేతితో తట్టుతూ ఉండడం, ప్రకంపనతో ఊపుతూ, లేక జాయింట్లను కదుపుతూ ఉండడం. వ్యాధి పరిస్ధితిని, మర్దన చేస్తూ ఉండే శరీర భాగాలను బట్టి ఈ విధంగా చేసే కదలికలు, ఒత్తిడులు మారుతూ ఉంటాయి.
వ్యాధితో ఉన్న అనేక పరిస్ధితులలో, సహాయకారిగా ఉండే మరో మర్దన చేసే పద్ధతి ఊపుతూ, ప్రకంపనను కలిగిస్తూ చేసేటటువంటిది. పౌడరు మర్దన, నీటి మర్దన, పొడి మర్దన. వేప ఆకు పౌడరు, గులాబి రేకులు కూడా మర్దనలో కావలసిన నూనెలుగా వినియోగింపబడతాయి.
మర్దన వల్ల కలిగే శారీరక ప్రభావాలు
ప్రతిక్రియా ప్రభావాలు (నాడీ విధానంలో కలిగే ప్రతిస్పందనలు )
  1. ధమనులలో రక్తనాళ వ్యాకోచం
  2. జీర్ణ క్రియలో సహకరించే కండరాల ప్ర్రేరేపణ, ఉద్దీపనం
  3. కండరాలు పనిచేసే విధానంలో పెరుగుదల లేక తరుగుదల
  4. ఉదరంలో ఖాళీగా ఉండే చోట్ల అయవవాల కార్యకలాపాలను వృధ్దిచేస్తుంది
  5. విశ్రాంతి నుండి లభించే ప్రతిస్పందనలను వేగవంతం చేస్తుంది
  6. కండరాలపై మెత్తని, మృదువైన లేక ఉత్తేజపరిచే ప్రభావం
  7. గుండెను ఉత్తేజపరిచి, ముడుచుకునే బలాన్ని మరియు వేగాన్ని పెంచుతుంది
  8. వ్యాధి నిరోధక శక్తియొక్క సామర్ధ్యాన్ని పెంచుతుంది
యాంత్రిక ప్రభావాలు (ప్రత్యక్షంగా చేతులతో చేసిన ఒత్తిడితో కలిగే ప్రతిస్పందనలు, ప్రభావాలు)
  1. పెరిగిన సిర సంబంధిత ప్రాప్తి, పెరిగిన రక్తనాళ సంబంధిత ప్రసరణ
  2. సమర్ధవంతమైన ప్రసరణా విధానం
  3. శ్లేష్మాన్ని ఒదులుగా చేయడం, సులభతరం చేయడం (శ్వాసపీల్చుకునే విధానం)
  4. ఫైభ్రోసిస్ (శరీరంలో కొన్ని ధాతువులు, కండరాలు విపరీతంగా పెరగడం) కు/అతుక్కుపోయి ఉండడానికి విఘాతం కలుగజేయడం.
  5. కుచించుకుపోయి ఉండే కండరాలను విస్తరింపజేయడం / కండరాలలో ఉండే పీచు వంటి వాటిని ఒదులు చేయడం.
  6. పెరిగిన కండరాల ఉష్ణోగ్రత
  7. స్ధానికంగా పెరిగిన జీవప్రక్రియ స్ధాయి, వాయువులతో ఉండే మార్పిడి
  8. మచ్చలతో ఉండే ధాతువులను విస్తరింపజేయడం
  9. తగ్గిన కండరాల/పెరిగిన కండరాల రీతి
  10. అధిక స్ధాయిలో కదలికలు
  11. సరైన జాయింట్ యంత్రగతి / జీవ యంత్రగతిని పునరుధ్దరించడం
  12. కండరాలలో అసమానతలను తొలగించడం
  13. బలహీనంగా ఉండే నరాలను బలోపేతం చేయడం

మర్దన వల్ల లాభాలు
సాదారణంగా శరీర అవయవాలన్నింటికి చేసే మర్దన అనేక విధాలుగా అత్యధిక లాభాలనిస్తుంది. నరాల వ్యవస్ధను ఇది సరిదిద్దుతుంది. శ్వాసపీల్చుకోవడాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే శరీరాన్నుండి విషపూరితమైన మరియు వ్యర్ధ పదార్ధాలను తొలగించుకోవడానికి ఊపిరితిత్తులు, చర్మం, మూత్ర పిండాలు మరియు పేగులు వంటివాటి ద్వారా వీలైన వివిధ తొలగింపు చేసే అవయవాల ద్వారా తొలగించడాన్ని వేగవంతం చేస్తుంది. రక్త ప్రసరణను మరియు జీర్ణ ప్రక్రియలను కూడా ఇది ప్రోత్సహిస్తుంది. మొహంలో ఉండే ముడతలను మర్దన పోగొడుతుంది. పీక్కుపోయి, లోపలి వైపునకుండే బుగ్గలను, మెడను కూడా ఇది ఉబ్బినట్లుగా, నిండుగా కనపడేటట్లు చేయడంలో సహకరిస్తుంది. అలాగే, కండరాల నొప్పి ని, తిమ్మిరి ఎక్కడాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
సమానస్ధాయిలో ఉండే వారిచే సమీక్షింపబడిన వైద్య పరిశోధన మర్దన వల్ల కలిగే లాభాలు నొప్పి నుండి, బాధ నుండి ఉపశమనం, ప్రత్యేక లక్షణాలలో ఆదుర్దా, వ్యాకులత మరియు ఒత్తిడికి గురవ్వడాన్ని తగ్గించడం, అలాగే తగ్గిపోయిన రక్త ప్రసరణ, గుండె కొట్టుకునే స్ధాయి మరియు స్ధిరవ్యాకులతను తాత్కాలికంగా తగ్గించడంతో కూడి ఉంటాయని చూపిస్తోంది. అందుచేత మర్దన చేసే వెనక వుండే సిధ్దాంతాలు ఏమిటంటే ఓలిసెప్షన్ ద్వారాన్ని నియంత్రీకరించే సిద్ధాంతం (గేట్ కంట్లోల్ థియరీ), ఎండార్ఫిన్లను (మెదడులోని నాడులలో సహజంగా జరిగే రసాయన ప్రక్రియ, భాధానివారణ గుణాలను కలిగిన లక్షణాలతో ఉండేవి) మరియు సిరోటినిన్ (నిద్రలో, ఒత్తిడిలో మరియు జ్ఞాపకశక్తికి పనిచేస్తూ, మెదడులో ఉండే ఒక ట్రాన్స్మిట్టర్ (సమాచారాన్ని చేరేవేసే సాధనం వంటిది) విడుదలను, పేరా సింపథెటిక్ (పరాసహానుభూత) కండరాలవ్యవస్ధను క్రియాశీలకంగా, ఉత్తేజపరడం, ఫైభ్రోసిస్ (శరీరంలో కొన్ని ధాతువులు, కండరాలు విపరీంతంగా పెరగడం లేక మచ్చలతో ఉండే ధాతువులను నివారించడం, రసి, శోషరసం ప్రసరణను పెంచడం మరియు నిద్రను మెరుగుపరచడం. కానీ చక్కగా రూపొందించబడిన చికిత్సా సంబంధిత అధ్యయనాలచే ఇది ఇంకా బలపరచబడవలసి ఉంది.


ఒత్తుతూ చేసే వైద్య/చికిత్సా విధానం
ఆక్యుప్రెషర్ (ఒత్తిడితో చేసే వైద్య/చికిత్సా విధానం) చేతి వేళ్లను లేక మొండిగా ఉండే ఏ ఇతర వస్తువులనైనా చర్మం ఉపరితలంపై ఉండే ‘అక్యూ పాయింట్ల’పైనా(శక్తిని నిలువ ఉంచే స్ధానాలు), చర్మంపై లయబధ్దంగా, గట్టిగా నొక్కిపెట్టి, శరీరంలో ఉండే సహజ నిరోధకశక్తులను ఉత్తేజపరుస్తూ ఉపయోగిండం అనాదిగా వస్తున్న ఒక ఉపశమనాన్ని కలిగించే కళ వంటిది. ఈ స్ధానాలను (పాయంట్ల) నొక్కిపెట్టినప్పుడు, అవి కండరాల బిగువును ఒదులుగా చేస్తూ, వ్యాధిని నయం చేయడానికి రక్త ప్రసరణను మరియు శరీరం యొక్క జీవశక్తిని ప్రోత్సహిస్తాయి.
ఆక్యుపంక్చర్ (సూదులతో గుచ్చుతూ చేసే వైద్యం/చికిత్స) మరియు అక్యూప్రెషర్ (ఒత్తిడితో చేసే చికిత్సః) రెండూ కూడా ఒకే స్ధానాలను (పాయింట్స్)ను ఉపయోగిస్తాయి. ఆక్యుప్రెషర్ చేతులతో లేక మొద్దుగా ఉండే ఏ సాధనంలతోనైనా చేతులతో నెమ్మదిగా ఒత్తి పట్టుకుంటే, ఆక్యుపంక్చర్ మాత్రం సూదులను ఉపయోగిస్తుంది. కనీసం 5000 సంవత్సరాలనుండి ఆక్యుప్రెషర్ ను ఒక ఉపశమనం కలిగించే, వ్యాధిని నయంచేసే కళగా సాధన చేయబడుతోంది. ఈ వైద్య, చికిత్సా విధానాన్ని మొత్తం, 3000 కు పైగా సంభవిస్తూ ఉండే పరిస్ధితులలో చికిత్స చేయడానికి, లిఖితపూర్వకంగా, ఒక మూలపత్రంగా (డాక్యుమెంటెడ్) నిక్షేపం చేయబడింది. ఇప్పుడు ట్రాన్స్ క్యుటేనియస్ (శరీరానికి గాయం కాకుండా, శరీరంపై ప్రత్యక్షంగా విద్యుత్ ను ఉపయోగించడం) విద్యుత్ తో కండరాలను ఉత్తేజపరచే విధానాన్ని) (టెన్స్ – TENS – దీనికి మరోపేరు మరియు లేజర్ నుండి లేజర్ కిరణాలను లేక ఎల్.ఇ.డి. డయోడ్సు నుండి లేజర్ కాంతిని, ఒక నిర్దుష్టమైన తరంగదైర్ఘ్యంలో (వేవ్ లెంత్స్) వినియోగించుకుంటూ, ఆక్యుపాయింట్స్(స్ధానాల) కు సాధారణంగా ఈ చికిత్సను చేస్తున్నారు. ఇది వేగవంతంగా పనిచేస్తూ, చిరస్ధాయిగా ఉండే ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆక్యుప్రెషర్ సిద్ధాంతం మరియు అక్యూపాయింట్లను ఉత్తేజపరచడం అక్యూపంక్చర్ లో ఉపయోగించే సూత్రాల పైనే ఆధారపడి ఉంటుంది. సూదులకు బదులుగా ఒత్తిడి కలిగిస్తూ విద్యుత్ ఉత్ప్రేరకాన్ని లేక లేజర్ కాంతిని ఉపయోగించడం ద్వారా శరీరం ద్వారా ప్రసరిస్తూ ఉండే, శక్తితో కూడి ఉండే ధృవరేఖలు (మెరిడియన్) మృదువుగా ఉన్న స్పష్టమైన ప్రతిక్రియతో స్ధానాలను ఉత్తేజపరచడంలో ఇది పనిచేస్తుంది. శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవంతో సంబంధం కలిగి ఉండే 14 ముఖ్యమైన ధృవరేఖలు ఉన్నాయి. ఈ దృవరేఖల గుండా జీవన శక్తులు సమతుల్యంతో, సరైన పద్ధతిలో ప్రవహించగలిగినప్పుడు కలిగే దాని ఫలితమే – మంచి ఆరోగ్యం. మీరు బాధను లేక అనారోగ్యం అనుభవిస్తున్నారంటే, మీ శరీరంలో ప్రవహించే శక్తిలో ఎక్కడో ఒక అడ్డంకి లేక కారణం అనేది ఉందని చెప్పడానికి ఇది ఒక సూచన అన్న మాట.
సరైన స్ధానాన్ని (పాయింట్) కనిపెట్టడం కోసం, ఒక విచిత్రమైన ఎముక’ (ఫన్నీ బోన్)గా అనుభూతిని కలిగించే, లేక ఇంద్రియగ్రాహ్యమైన లేక మెత్తగా, బాధను కలిగిస్తూ ఉండే ఆ ప్రాంతాన్ని మృదువుగా, లోతుగా పరీక్షించి చూడండి. అప్పుడు ఆ స్థానానికి నొప్పి కలిగేటట్లుగా తగినంత గట్టిగా నొక్కండి. స్ధిరమైన ఒత్తిడితో గానీ లేక 5 సెకండ్ల పాటు ఒత్తిడినిస్తూ 5 సెకండ్లు ఆపి అదే క్రమంలో ఇచ్చే ఒత్తిడి వల్ల ఉత్తేజం కలుగుతుంది. సాధారణంగా ప్రతిసారి చికిత్సా సమయం ఒక నిముషం ఉంటే సరిపోతుంది.
తలనొప్పి , కంటిభారం, జలుబుతో ముక్కు కారే సమస్య, మెడనొప్పి, వీపునొప్పి, కీళ్లవాతం, కండారాల నొప్పులు, ఒత్తిడి వల్ల నరాలు బిగుసుకుపోయి ఉండడం వంటి టెన్షన్ మరియు వ్రణం, కురుపుల వల్ల నొప్పి, బాధ, బహిష్టు సంబంధిత ఆటంకాలు వెనుకవైపు క్రింది వెనుక భాగంలో నొప్పి, మలబధ్దకం, అజీర్ణం, ఉద్రిక్తత, నిద్రలేమి వంటి వాటినుండి ఉపశమనాన్ని కలిగించడంలో ఆక్యుప్రెషర్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఆక్యుప్రెషర్ ను శరీరాన్ని సమతుల్యంలో ఉంచుతూ, మంచి ఆరోగ్యాన్ని పోషించుకోవడానికి ఒక మార్గంగా వినియోగించుకోవడం వల్ల అమోఘమైన లాభాలున్నాయి. ఉపశమనాన్నిచ్చే అక్యుప్రెషర్ స్పర్శ ఉద్రిక్తతను తగ్గించి, రక్త ప్రసరణను పెంచుతూ, శరీరాన్ని గాఢమైన విశ్రాంతిని తీసుకోవడానికి వీలుకలిగిస్తుంది. ఒత్తిడినుండి దూరం చేయడంతో ఈ అక్యుప్రెషర్. వ్యాధులకు తట్టికోలిగే నిరోధక శక్తిని బలోపేతం చేసి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

ఆక్యుపంక్చర్ (సూదులతో గుచ్చుతూ చేసే వైద్యం/చికిత్స)
ఆక్యూపంక్చర్ అనేది భాధనుండి, నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి మరియు చికిత్సా అవసరాలకు, చక్కటి, సన్నటి దారంలాగ ఉండే సూదులతో శరీరంపై నిర్థిష్టమైన స్ధానాలలో లోపలికి గుచ్చే ఒక పద్ధతి. ఆక్యూపంక్చర్ అనే మాట లాటిన్ భాషలోని ఆకుస్ ‘సూది‘ మరియు ‘పంజీర్’ – ‘గుచ్చుట’ అనే మాట నుండి పుట్టింది.
చైనీయుల సాంప్రదాయ వైద్య సిద్ధాతం ప్రకారం ఆక్యూపంక్చర్ స్ధానాలు(పాయింట్స్) ‘కి’ (qi) అంటే జీవశక్తితో పాటుగా ప్రవహించే ధృవరేఖలపై ఉంటాయి. ధృవరేఖలపై ఆక్యుపంక్చర్ స్ధానాలు ఉనికిని కలిగి ఉంటాయన్న వాదనకు తెలిసి వున్న శరీరావయవశాస్త్ర సంబంధిత లేక కణనిర్మాణ శాస్త్ర సంబంధిత ఆధారాలేమీ లేవు.
చైనాలో బియాన్ షి లేక పదునుగా చేయబడిన రాళ్లతో చేయబడుతూ ఉండే ఈ ఆకుపంక్చర్ బహుశా రాతియుగం కాలంనాటి నుండి వాడుకలో ఉందని చెప్పవచ్చు. చైనాలో ఆకుపంక్చర్ యొక్క పుట్టుక ఖచ్చితంగా చెప్పలేనిది, అనిశ్చితమైనది. ఆకుపంక్చర్ ను గురించి మొట్టమొదటి సారిగా వివరిస్తూ ఉండే అతి పురాతన చైనీస్ వైద్య గ్రంథం ‘ఎల్లో ఎంపరర్స్ క్లాసిక్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ (దేశీయ వైద్యం/చికిత్స)’ (ఆక్యుపంక్చర్ యొక్క చరిత్ర) అయిన ‘హువాంగ్డి నీజింగ్’ అనే గ్రంథం. ఇది ఇంచుమించు క్రి.పూ. 305-204 లో సంకలనం చేయబడింది. క్రీ.పూ.1000 ముందు కాలంనుండి ఈ ఆక్యుపంక్చర్ పద్ధతి ఉపయోగంలో ఉండవచ్చని సూచిస్తూ కొన్ని హీయరోగ్లిఫిక్స్ (పురాతన కాలంలో బొమ్మల సంకేతాలతో వ్రాయబడే ఒక పద్ధతి) గ్రంథాలు లభించాయి. ఒక పురాతన ఇతిహాసం ప్రకారం, చైనాలో యుధ్దంలో బాణాలతో గాయపడిన కొందరు సైనికులు, శరీరంలో ఇతర అవయవాలలో ఉన్న బాధనుండి కొంత ఉపశమనాన్ని పొందినట్లు అనుభూతిని చెందడంతో ఆక్యుపంక్చర్ చికిత్స ప్రారంభమైంది. దరిమిలా, బాణాలతోనే (తరువాత సూదులతో) ఈ చికిత్స చేయడాన్ని ప్రజలు మొదలు పెట్టేరు. చైనా నుండి ఆక్యుపంక్చర్ కొరియా, జపాన్ మరియు వియత్నామ్ మరియు తూర్పు ఆసియాలో అనేక ప్రాంతాలకు పాకింది. 16వ శతాబ్థంలో ఆక్యుపంక్చర్ నివేదికలను (రిపోర్ట్స్) పశ్చిమానికి తీసుకువచ్చిన వారిలో మొట్టమొదటి వారు పోర్చుగీస్ థర్మప్రచారకులు (మిషనరీలు).
ఆక్యుపంక్చర్ యొక్క సాంప్రదాయ సిద్ధాంతాలు
సాంప్రదాయబద్ధమైన చైనీయుల వైద్య శాస్త్రంలో ‘ఆరోగ్యం’ అనేది శరీరంలో ‘ఇన్’ మరియు ‘యాంగ్’ లలో సమతుల్యమైన స్ధితిగా పరిగణింపబడేది. కొందరు ఈ ఇన్ మరియు యాంగ్ లను సహానుభూతమైనవి (సింపథిటిక్) మరియు పరాసహానుభూతమైన (పేరాసింపథిటిక్) నాడీ వ్యవస్ధలుగాను పొల్చిచూడడం జరిగింది. ఆక్యూపంక్చర్ లో ప్రథానంగా, ముఖ్యంగా చెప్పదగినది స్సేఛ్చాయుతంగా ప్రవహిస్తూ ఉండే, తర్జుమా చేయడానికి కష్టమైన, చైనీయుల ఆలోచనా విధానంలో వ్యాపించి ఉన్న, సాధారణంగా ఒక ‘జీవ శక్తి ‘ గా అభివర్ణింపబడే ‘కి’ అనే ఒక భావన వంటిది. ‘కి’ అనేది అప్రస్తుతం అందుచేత యాంగ్, దాని యొక్క ఇన్, వాటి ప్రతిరూపానికి (కౌంటర్ పార్ట్) సంబంధించినది రక్తం (శారీరక, శరీర ధర్మ సంబంధితమైన రక్తాన్నుండి వేరు చేయడానికి ఉద్దేశింపబడి, ఉజ్జాయింపుగా, (చాలా వరకు దానికి సమానమైనంగా వుండేది). లోపం ఉన్న చోట దానిని సరిచేస్తూ, అతిగా, అపరిమితంగా ఉన్నదానిని ఖాళీ చేస్తూ, ఈ ప్రసరణ నిలిచి పోయన చోటునుండి స్వేఛ్చాయుతమైన ప్రసరణను ప్రోత్సహిస్తూ ఆక్యూపంక్చర్ ‘కి’ ను మరియు రక్తాన్ని స్వేఛ్చగా ప్రసరించడాన్ని క్రమబధ్దీకరిస్తుంది. ఆక్యూపంక్చర్ కు సంబంధించిన వైద్య సాహిత్యంలో ఉన్న ఒక స్వయంసిద్ధమైన సూత్రం ఏమిటంటే “నొప్పి లేదు, దిగ్భంధం లేదు; దిగ్భంధం లేదు, నొప్పి లేదు” అనేది.
సాంప్రదాయబద్ధమైన చైనీయుల వైద్యం / చికిత్స మానవ శరీరాన్ని అనేక విధాలైన ‘విధుల’ నిర్వహణతో, సాధారణంగా శరీర నిర్మాణ సంబంధిత అవయవాలుగా ఉండే ఒక మొత్తంగా భావించి చికిత్సను చేస్తుంది, కానీ వాటితో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకుని కాదు. ఈ విధానాలకు చైనీయులుపయోగించే మాట ‘జాంగ్ ఫు’ అనేది. ఇందులో ‘జాంగ్’ ను ‘అంతరంగాలు’ గానూ లేక స్ధిరంగా ఉండే అవయవాలు గానూ, ‘ఫూ’ ను ‘పేగులు’ గానూ లేక డొల్లగా (ఖాళీగా) ఉండే అవయవాలు గానూ తర్జుమా చేయబడ్డాయి. పనిచేసే విధానాలను శారీరక అవయాల నుండి వేరుచేసి చూడాలంటే జాంగ్ ఫు లను ఇంగ్లీషు భాషలో ఉండే ఊపిరితిత్తి, గుండె, మూత్రపిండం, మొదలైనవిగా వాడుకలోకి తీసుకోవాలి. వ్యాధి అనేది ఇన్, యాంగ్, కి మరియు రక్తం యొక్క సమతుల్యతల లోపంగా భావించుకోవచ్చు. [హోమియోస్టాసిస్ (తన చుట్టూ ఉన్న పరిసరాలలో కలిగే మార్పులతో శరీరం సరిపెట్టుకుని సమతుల్యంతో ఉండగలిగే స్వభావం)కు ఇది కొంత సారూప్యతను కలిగి ఉంటుంది]. ఒకటి లేక అంతకంటే ఎక్కువ అయవాల విధులలో సూదులు, ఒత్తిడి, వేడి మొదలైన కార్యకలాపాలను శరీరంపై ఉండే సున్నితమైన భాగాలపై, కొద్ది పరిమాణంలో చేయడం ద్వారా కొంత సవరణను చేస్తూ, వ్యాధికి చేసే చికిత్సకు ప్రయత్నం చేయబడుతుంది. దీనినే ఇంగ్లీషు భాషలో ‘ ఆక్యూపంక్చర్ పాయింట్స్’ అని, చైనా భాషలో ‘స్యూ’ అని అంటారు. టి.సి.ఎమ్. లో దీనిని చికిత్సలో ‘సామరస్యం లేని ధోరణులు’ గా పేర్కొనడం జరిగంది.
ప్రధాన ఆక్యుపంక్చర్ స్ధానాలు (పాయింట్స్) చాలా వరకూ ‘12 ప్రధాన ధృవరేఖల’ మీదా మరియు ‘8 అధిక (ఎక్స్ ట్రా) ధృవరేఖల’ రెండింటి పైనా (డ్యూ, మాయి మరియు రెన్ మాయి), మొత్తం ‘14 మార్గాలుగా’ కనిపిస్తాయి. ఇవి ప్రాచీన కాలానికి చెందిన చైనీయుల వైద్య గ్రంథాలలో, ‘కి’ మరియు ‘రక్తం’ ప్రవహిస్తూ ఉండే మార్గాలుగా అభివర్ణింపబడ్డాయి. మృదువుగా, మెత్తగా ఉండే ఇతర స్ధానాలు (పాయింట్స్) (‘అషి పాయింట్స్‘గా పిలువబడేవి) పేరుకుపోయి ఉండే స్ధానాల వద్ద ఉన్నట్లుగా భావించబడతాయి కాబట్టి వాటిని కూడా సూదులతో గుచ్చవచ్చు.
ఆక్యుపంక్చర్ సమర్ధవంతమైన చికిత్సగా క్రియాపూర్వకంగా ఋజువు చేయబడిన వ్యాధుల శ్రేణి, వ్యాధి లక్షణాలు లేక పరిస్ధితులు ఈ క్రింద చూపబడ్డాయిః
  • ప్రతికూలత (ఎలర్జీ) వల్ల ముక్కు కారుతూ ఉండే పరిస్ధితి
  • దిగాలుగా, నిరుత్సాహానికి లోనవడం
  • తలనొప్పి
  • పొద్దున్న పూట వచ్చే అనారోగ్యంతో సహా, వికారం మరియు వాంతులు
  • జీర్ణాశయం యొక్క ముందు భాగం, ముఖం, మెడ, టెన్నిస్ మోచెయి, నడుము క్రింది భాగం, మోకాలుపైనా, పంటికి చికిత్స చేసేటప్పుడు మరియు ఆపరేషన్ చేసిన తరువాత కలిగే నొప్పి
  • ప్రాథమిక బహిస్టు వేదన/నొప్పి
  • కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు
  • తుంటి నరాల నొప్పి
  • మెజ్జకు/గర్భాశయ ద్వారానికి సంబంధించిన మరియు నడుముకు సంబంధించిన ఇబ్బందులు
  • శ్వాస సంబంధిత ఉబ్బసం
  • నిద్రలేమి


వర్ణాలతో (రంగులతో) చేసే చికిత్స
సూర్యకిరణాల ఏడు వర్ణాలు వివిధ చికిత్సా సంబంధింత ప్రభావాలు కలిగి ఉన్నాయి. ఇవి ఊదా , నీలి వంకాయ , నీలం , ఆకుపచ్చ , పసువు , నారింజ మరియు ఎరుపు రంగులు. ఆరోగ్యంగా ఉండడానికి మరియు వివిధ వ్యాధులకు చికిత్స చేసేటప్పుడు, ఈ రంగులు సమర్ధవంతంగా పనిచేస్తాయి. నీరు మరియు నూనె స్పష్టంగా కొన్ని గంటలసేపు రంగు సీసాలలోనూ మరియు రంగు గ్లాసులలోనూ సూర్యరశ్మికి గురిచేయబడినపుడు అవి క్రోమోథెరపీ (వర్ణ సంబంధిత చికిత్స) సాధనాలుగా వివిధ అనారోగ్యాలకు చికిత్స చేయడానికి ఉపయోగింప బడతాయి. ఈ వర్ణ సంబంధిత చికిత్సలోని సులభమైన పద్ధతులు వేగంగా కోలుకునే ప్రక్రియలో చాలా సమర్ధ వంతమైన రీతిలో సహకరిస్తాయి.

గాలి సంబంధిత చికిత్స
మంచి ఆరోగ్యానికి తాజాగా, స్వఛ్చంగా ఉండే గాలి చాలా అవసరం. గాలి ద్వారా చేసే చికిత్స వల్ల కలిగే లాభాలను గాలి స్నానంతో సాధించవచ్చు. వీలైతే, ప్రతిరోజు 20 నిముషాలు లేక అంతకంటే మరికొంత సేపు ప్రతి వారు గాలి స్నానం చేయాలి. ఉదయంపూట, వ్యాయామం మరియు చన్నీటితో రుద్దుకుంటూ చేసే స్నానంతో కలిసినపుడు ఇది చాలా ఉపయోగకరమైనది. ఈ ప్రక్రియలో ప్రతిరోజు దుస్తులను తీసివేసి లేక తేలికగా ఉండే దుస్తులను ధరించి ప్రతి వారు సరిపోయినంత స్వఛ్చమైన గాలి లభించే చోట, ఒంటరిగా, ఖాళీగా ఉన్న ప్రదేశంలో నడవాలి, ఒక పైకప్పు లేకుండా చుట్టూ తలుపులు (షట్టర్స్) లాంటి గోడలతో నిర్మించబడిన మరియు గాలిని స్వేఛ్చగా లోపలికి రానిచ్చేటట్టుగానూ, అలాగే లోపలి భాగం బయటకు కనిపించకుండా ఉండే గదిలో నడవడం మరొక ప్రత్యామ్నాయ పద్ధతి.
యంత్ర రచన
రక్త ప్రసరణను నియంత్రీకరించే నాడీ కేంద్రాలు చల్లటి గాలికి లేక నీటికి వ్యతిరేకంగా ప్రతిస్పందించడానికి ఉపరితలానికి రక్తాన్ని అధిక పరిమాణంలో పంపుతాయి, వెచ్చగా, ఎర్రగా, ధమని సంబంధిత రక్త ప్రసరణతో చర్మాన్ని ఉత్తేజపరుస్తాయి. రక్త ప్రసరణా ప్రవాహం అధిక వేగవంతం చేయబడుతుంది, అలాగే శరీర ఉపరితలంపై ఉండే అనారోగ్యకరమైన పదార్ధాలను తొలగించడం కూడా దానికనుగుణంగా పెరుగుతుంది.

లాభాలు
శరీర ఉపరితలమంతటా, మిలియన్ల కొద్ది ఉండే నరాల చివర్లపై గాలి స్నానం ఒక సేద దీర్చే, హాయిని గొలిపే, బలవర్ధక ఔషధం మాదిరిగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలిసిపోయి. బలహీనంగా ఉండడం, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, చర్మ, మానసిక మరియు వివిధ ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సందర్భాలలో ఇది ఉన్నత ఫలితాల నిస్తుంది.


అయస్కాంత చికిత్స
అయస్కాంత చికిత్స అనేది మానవవ్యాధులకు సంబంధించిన చికిత్సా పధ్దతులను అనుసరిస్తూ రోగుల శరీరంపై అయస్కాంత వినియోగంతో చికిత్సను చేసి, వ్యాధిని నివారణ చేసే వైద్యం. చాలావరకు ఏ మాత్రం అనుషంగ ప్రభావాలు(సైడ్ ఎఫెక్ట్స్)గానీ, తదుపరి ప్రభావాలు గానీ లేకుండా ఉండే అతి సులువైన, చవకైన మరియు పూర్తిగా బాధారహితమైన చికిత్సా విధానం ఇది. దీనిలో ఉపయోగించే సాధనం కేవలం ఒక అయస్కాంతం మాత్రమే.
అందుబాటులో ఉన్న, వివిధ స్ధాయిలలో ఉండే, శక్తి కలిగి చికిత్సకు ఉపయోగించే అయస్కాంతాలను శరీర భాగాలపై ప్రత్యక్షంగా పెడుతూ గానీ లేక శరీరానికి ఒక సాధారణ చికిత్సను చేసే మాదిరిగా ఈ చికిత్సను చేయడం జరుగుతుంది. ఉదరం, మోకాలు, మణికట్టు మొదలైన వివిధ శరీర భాగాలకు అనువైన అయస్కాంత బెల్టులు కూడా అందుబాటులో ఉంటాయి. అయస్కాంత నెక్లెసులు, కళ్లద్దాలు మరియు చేతికి వేసుకునే కంకణాలు లేక గొలుసులు (బ్రేస్ లెట్) కూడా ఈ చికిత్సలో ఉపయోగించబడతాయి.
లాభాలు: శక్తిని, ఓపికను సమతుల్యంగా ఉంచుకోవడంలో సహకరిస్తుంది. దీనిని ఉపయోగించిన చోట రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుంది.

ప్రకృతి వైద్యంలో విద్యనభ్యసించడం
సరైన, యోగ్యత కలిగిన మానవశక్తి (మ్యాన్ పవర్) విపరీతనైన కొరత ఉండడం వల్ల ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతికి సమానంగా యోగా మరియు ప్రకృతివైద్యం ఆశించినంతగా అభివృధ్దిని, ప్రోత్సాహాన్ని సాధించలేక పోయాయి. అయితే, ఇటీవల కొన్ని సంవత్సరాలలో, అనేక ప్రభుత్వేతర సంస్ధలు (ఎన్.జి.ఓ.లు) మరియు స్వఛ్చంద సేవాసంస్ధలు యోగా మరియు ప్రకృతి వైద్య ఆరోగ్య గృహవసతులను (హోమ్స్) అలాగే డిగ్రీ కళాశాలలను (కాలేజెస్) నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశంలో ఇటువంటి 12 కళాశాలలున్నాయి.
  1. రాజీవ్ గాంధీ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం, బెంగుళూరుకు అనుబంధంగా కర్ణాటకలో 3 కళాశాలలు.
  2. తమిళనాడు ఎమ్.జి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం, చెన్నైలో 4 కళాశాలలు.
  3. ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో 2 కళాశాలలు.
  4. ఆయుష్ విశ్వవిద్యాలయం, రాయ్ పూర్, చత్తిస్ ఘడ్ లో 1 కళాశాల.
  5. బర్కతుల్లా విశ్వవిద్యాలయం, భోపాల్ మరియు ఆయుర్వేద విశ్వవిద్యాలయం, జామ్ నగర్, గుజరాత్ లలో చెరి 1 కళాశాల.
యోగా మరియు ప్రకృతి వైద్యంలో లభించే కోర్సులు “డిగ్రీ కోర్సు, బ్యాచ్లర్ ఆఫ్ నేచురోపతి మరియు యోగిక్ సైన్సెస్ (బి.ఎన్.వై.ఎస్.– B.N.Y.S)”కు యోగ్యతను కలిగించే 5 ½ సంవత్సరాలు (4.1/2 సంవత్సరాలు కోర్సు + 1 సంవత్సరం ఇంటరన్ షిప్)
ఈ వైద్య విద్యా కొర్సును చదవాలనుకునే విధానం యోగా మరియు ప్రకృతి వైద్య సిద్ధాంతం ఒకదానికి మరొకటి అనుబంధంగా ఉంటూ ఉండేవే కాకుండా ఒక విజయవంతమైన సాధనను, అభ్యాసాన్ని నెలకొల్పడం కోసం అవసరం అయ్యే రోగ చికిత్స సంబంధిత సాధనాలను మరియు విధానాలను కూడా నొక్కి చెబుతుంది. ఈ కళాశాలలన్నీ కూడా సిద్ధాంత పరమైన, ఆచరణీయమైన, క్రియాత్మకమైన, చికిత్సా సంబంధిత సౌకర్యాలతో విద్యార్ధులకు బహుముఖ శిక్షణనివ్వడంలో సహాయపడే విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ కోర్సులో విద్యార్ధులు అన్ని అంశాలలోనూ పూర్తిగా ఔషధరహితమైన మరియు సహజసిద్ధమైన, వైవిధ్యం గల సంపూర్ణ చికిత్సా విధానాలను అధ్యయనం చేయడానికి అవకాశాన్ని పొందుతారు.
దేశంలో అనేక ఆధునిక వైద్య సంస్ధలు యోగా యొక్క సమర్ధతను, దానికి సంబంధించిన వివిధ అంశాలను ఋజువు చేయడానికి తీవ్రమైన కృషి చేయడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. సమతుల్యతతో కూడి ఉండి మరియు అన్ని విధాలా మానవ వ్యక్తిత్వాన్ని అభివృధ్ది చేయడానికి యోగాను ఒక సాధనంగా కొన్ని విశ్వ విద్యాలయాలు స్వీకరించి యోగశాఖలను నెలకొల్పడం జరిగింది. ఇక్కడ ఒక సంవత్సరం కాలవ్యవధితో ఉండే బోధకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. యోగాలో సర్టిఫికెట్స్, డిప్లోమా మరియు డిగ్రీలలో కొర్సులను బోధించే 18 విశ్సవిద్యాలయాలు ఉన్నాయి. యు.జి.సి. (యూనివర్సటీ గ్రాంట్స్ కమిషన్– విశ్వవిద్యాలయాలకు ఆర్ధిక గ్రాంటులనిచ్చే కమీషన్) కూడా విశ్వ విద్యాలయాలలో యోగా కోర్సును ప్రారంభించడానికి ఆర్ధిక సహాయాన్నిందిస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు సర్టిఫికెట్ కోర్స్ స్ధాయినుండి పరిశోధన (పి.హెచ్.డి) కోర్సుల స్ధాయి వరకూ యోగాను బోధిస్తున్నాయి. రాబోయే సంవత్సరాలలో అనేక విశ్వవిద్యాలయాలు యోగ శాఖలను ప్రారంభించబోతున్నాయి. అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు యోగవిద్యను ప్రారంభించాయి, అలాగే పరిశోధనలు కూడా పురోగతిలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు యోగాను వారి విద్యా పాఠ్యాంశంగా అమలుచేయాలని ప్రతిపాదిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలు మరియు కొత్త ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ యొక్క వివిధ పాఠశాలలలోనూ ఇంచుమించు వెయ్యిమంది యోగా ఉపాధ్యాయులు నియమింపబడ్డారు. భారతదేశమే కాకుండా, యోగాను మనసు, చర్మ సంబంధిత అనారోగ్యాలకు చికిత్స చేయడానికి క్రమం తప్పుకుండా సాధన చేస్తున్న అనేక ఇతర దేశాలున్నాయి.

1 కామెంట్‌: