22, జనవరి 2013, మంగళవారం

అనర్థమే

అణువిద్యుత్‌తో అనర్థమే

 'అణువిద్యుత్ కేంద్రాలు ఎంత మాత్రమూ సురక్షితం కావు. వాటిలో ప్రమాదాలు జరిగితే నివారించే భద్రతా వ్యవస్థ మనవద్ద లేదు'' అంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)  పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ-మత్స్యలేశం పరిసర మత్స్యకార గ్రామాల ప్రజల భయాందోళనలను మరింత బలపరుస్తోంది. భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందాల్లో భాగంగా కొవ్వాడ-మత్స్యలేశంలో అణువిద్యుత్ కేంద్రం నెలకొల్పడానికి కొన్నేళ్లుగా సన్నాహాలు జరుగుతున్నాయి. 2011 మార్చిలో జపాన్ వంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంలో అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదాన్ని నివారించలేకపోవడంతో, అధికార యంత్రాంగంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం గూడు కట్టుకుని ఉన్న మనరాష్ట్రంలో ఇలాంటి ప్రమాదం జరిగితే పట్టించుకునే పరిస్థితి ఉండదేమోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. ఈ అనుమానాలను కాగ్ నివేదిక బలాన్ని చేకూరుస్తోంది. కొవ్వాడ-మత్స్యలేశంలోని సముద్ర తీర ప్రాంతంలో నిర్మించబోయే అణువిద్యుత్ కేంద్రంలో ఆరు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంగల ఆరు అణురియాక్టర్లను నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకపోయినా భూసేకరణలో మాత్రం జిల్లా కలెక్టర్ మొదలుకుని స్థానిక రె వెన్యూ అధికారులవరకూ అత్యుత్సా హం చూపుతున్నారు. అధికార కాం గ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అవగాహన లేకపోయినా అణువిద్యుత్ కేం ద్రాలు ఎంతో సురక్షితమైనవంటూ మ త్స్యకారులను నమ్మబలుకుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాగ్ నివేదిక అధికారులు, ప్రజా ప్రతినిధుల ఉత్సాహంపై ఒక్కసారిగా నీళ్లు చల్లింది.
 రియాక్టర్ల విస్ఫోటనంతో :  2011మార్చిలో జపాన్‌లో భూ కంపం, దీని ఫలితంగా సంభవించిన సునామీ, అదే సమయంలో టోక్యోకు 240 కిలోమీటర్ల దూరంలోని పుకుషిమా దైచీ అణువిద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ల విస్ఫోటనం, రేడియో ధార్మికత విడుదల ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ అణుముప్పు అణు విద్యుత్ కేంద్రం వల్ల రేడియేషన్, కాలుష్యం, ప్రమాదకరమైన వ్యాధులు అంతా అపోహలేనంటూ మత్స్యకారులను, ప్రజాప్రతినిధులను, విద్యావంతులను నమ్మిస్తూ వస్తున్న అధికారులు, కొవ్వాడ అణుపార్క్ ప్రతినిధులు జపాన్ అణువిద్యుత్‌కేంద్రం ప్రమాద ఘటన నేపథ్యంలో అప్పట్లో నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో పేలుడుతో పది కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఆ ప్రాంతంలో కనీసం మంచినీరు కూడా తాగొద్దని హెచ్చరికలు జారీచేశారు. గాలి కూడా కలుషితమైందని మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించాలని హెచ్చరించారు. భవిష్యత్‌లో కొవ్వాడ అణుపార్క్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడదన్న గ్యారెంటీ ఏమీలేదన్న సందేహాలు ఇక్కడి ప్రజల్లో అప్పటి నుంచీ బలంగా విన్పిస్తున్నాయి. ఈ తరుణంలో కాగ్ నివేదిక అణువిద్యుత్ కేంద్రాలు ఎంతమాత్రమూ సురక్షితం కా వని, వాటిలో జరిగే ప్రమాదాలను నివారించగలిగే భద్రతా వ్యవస్థ ఈ దేశంలో లేదంటూ స్పష్టం చేయడంతో అంతా అలోచనలో పడ్డారు. ఇప్పటికే రకరకాల ప్రాంతాల్లో అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగిన ప్రమాదాలను పరిశీలించి, వాటిపై అధ్యయనం చేసిన పర్యావరణవేత్తలు, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్న అంశాలు గమనిస్తే వీటివల్ల మానవాళికి ముప్పు తప్పదనే తెలుస్తోంది. కానీ దానిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లో లేరు...
 జబ్బులు ఖాయం :అణు విద్యుత్‌కేంద్ర కాలుష్యం, ప్రమాదాల వల్ల ఉత్పత్తి అయ్యే రేడియేషన్ వంటివాటితో అనర్ధాలు ఎన్నోరకాలు.. ముఖ్యంగా వీటివల్ల సంక్రమించే అనారోగ్యాలు రెండు రకాలు. శరీర సంబంధ జబ్బులు ఒకటైతే, జన్యు సంబంధ జబ్బులు మరొకటి. ఈ జబ్బులు అణుధార్మిక దూళి సోకిన స్వల్ప కాలానికే రావచ్చు, కొంత కాలం తర్వాతైనా అనారోగ్యానికి గురికావచ్చని వైద్యులు చెబుతున్నారు.

అత్యధికస్థాయిలో రేడియో ధార్మికత గురైన వ్యక్తికి కేంద్ర నాడీ వ్యవస్థ విఫలమవుతుంది. కొన్ని నిమిషాల వ్యవధిలో వికారానికి గురై వాంతులు చేసుకుంటాడు. జ్ఞాపకశక్తిని కోల్పోయి, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. రక్త విరోచనాలు సంభవిస్తాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లి 50 గంటల వ్యవధిలో చనిపోతాడని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 అణుధార్మిక దూళి మధ్యస్థ స్థా యిలో సోకిన వెంటనే మొదట వికా రం తర్వాత వాంతులు మరికొన్ని రోజులపాటు రక్త విరోచనాలు సంభవించి మూడు నుంచి పది రోజుల్లో చనిపోతారని వైద్యులు చెబుతున్నారు. తక్కువస్థాయిలో రేడియేషన్‌కు గు రైన వారికి కడుపులో మొదట దేవినట్టు వికారం మొదలవుతుంది. వాంతులు, విరోచనాలు ప్రేగుల కండరాలు ముడిచుకుపోయి భరించరాని బాధ, నోటి నుంచి చొంగ కారడం లాంటి అవలక్షణాలకు లోనవుతారు. నాడీ కం డర వ్యవస్థ అస్తవ్యస్ధమై తరచూ మానసిక ఆందోళనకు గురవుతారు. విపరీతంగా చెమట కారడం, జ్వరం తలనొప్పి తీవ్ర ఉద్రిక్తతకు లోనవుతారు. మూడు వారాల తర్వాత మెదడులో రక్త నాళాలు చిట్లి రక్త స్రావం కావడం, పొట్టలో అల్సర్లు, వెంట్రుకలు రాలిపోవడం, ఎముకలో క్రమంగా మూలుగ చెడిపో యి మరణం సంభవిస్తుంది. జన్యుపరమైన అనారోగ్యాలు మరింత దారుణంగా వుంటాయి. రేడియేషన్‌కు గురైన వ్యక్తి అకాల వార్ధక్యాన్ని పొందుతాడు. చర్మ, గొంతు, ఊపిరితిత్తులు, ఎముక, లివర్, రక్త తదితర రకాల క్యాన్సర్లు చుట్టుముడతాయి. ఈ అణుధార్మిక దూళి వలన జన్యుకణాలలో అనూహ్య, ఆకస్మిక మార్పులు జరుగుతాయి. లింగ నిర్ణాయక కణాలు అసహజ లక్షణాలను సంతరించుకోవడమో, లేదా చెడిపోవడమో జరుగుతోంది. దీనికి గురైన వారి సం తానం వివిధ రకాల జబ్బులతో జన్మిస్తున్నారు. తల్లి గర్భంలోని శిశువులో ఎదుగుదల లోపించడం, గర్భస్రావం జరగడం, మృతశిశువు జననం వంటివి సంభవిస్తాయి. గర్భస్థ శిశువు వయసు పదివారాల లోపు వుంటే అంగవైకల్యం, 15 వారాలలోపు వుంటే కళ్లులేని కబోదిగా, మెలితిరిగిన, నపుంసకులుగాను పుట్టే అవకాశం వుంది. 20 వారాలలోపు గర్భస్ధ శిశువులకు అణుదూళి సోకితే జీర్ణకోశ వైఫల్యం, మానసిక వికలాంగులుగా పుడతారని వైద్యనిపుణులు వివరిస్తున్నారు.
  అణుపార్క్‌ను నెలకొల్పే కొవ్వాడ-మత్స్యలేశం సముద్రతీరాన్ని ఆనుకుని ఉండడం, గతంలో ఈ ప్రాంతాన్ని భూగర్భశాస్త్రవేత్తలు భూకంపాల జోన్‌గా కూడా గుర్తించడం తో అన్నిరకాలుగా అణువిద్యుత్‌కేంద్రం ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఇన్ని వివాదాల మధ్య కాగ్ నివేదికను కనీసం పట్టించుకోకుండా కేంద్రప్రభుత్వం కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చే స్తుండడం పై నిరసనలు వ్యక్తమౌతున్నాయి.
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి